శివునికి ఇష్టమైన రాశులు ఇవేనంట.. మీ రాశి ఉందో చూడండి!
మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజున శివ, పార్వతులకు కళ్యాణం జరిగింది అంటారు. అందువలన ఈ పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడిని బిల్వ పత్రాలతో పూజించి, శివ
దిశ, వెబ్‌డెస్క్ : మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజున శివ, పార్వతులకు కళ్యాణం జరిగింది అంటారు. అందువలన ఈ పవిత్రమైన రోజున ఆ పరమేశ్వరుడిని బిల్వ పత్రాలతో పూజించి, శివ మంత్రాలు జపించిన వారికి మోక్షం లభిస్తుందంటారు.అలాగే శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి, జాగరణ చేస్తారో వారికి కూడ శివయ్య ఆశీస్సులు లభిస్తాయంట. అయితే శివరాత్రి రోజున జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివయ్యకు కొన్ని రాశులను ప్రత్యేకంగా ఇష్టపడుతాడంట. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : మేష రాశివారంటే శివుడికి చాలా ఇష్టమంట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి అంగారకుడు. అంగరాక గ్రహాన్ని శివునిలో భాగంగా పరిగణిస్తారు. శివుని చెమట చుక్క నుంచి అంగారకు ఉద్భవించాడంట. అందువలన మేష రాశి వారు ఈ శివరాత్రి రోజున అన్ని ఆచారసంప్రదాయాల ప్రకారం శివున్ని పూజించాలి.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి అంటే కూడా శివయ్యకు చాలా ఇష్టమంట. ఎందుకంటే వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. ఈరాశి వారు మహా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది.
మకర రాశి : శివుడి అనుగ్రహం ఉండే రాశుల్లో మకర రాశి ఒకటి. శని దేవుడు మకర రాశికి అధిపతి అందువలన ఈ రాశి వారికి శని దేవుడు, మహాదేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయంట.
కుంభ రాశి : కుంభ రాశి వారికి శని దేవుడు అధిపతి. అందువలన మహా శివరాత్రి రోజున ఈ రాశి వారు శివుడికి ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే, సంపదతో పాటు ఆదాయం కూడా పెరుగుతుందంట.