Vaisakh Purnima 2023: రేపు వైశాఖ పూర్ణిమ.. ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే ఊహించనంత డబ్బు వస్తుంది!
హిందూవులు పూర్ణిమ పండుగలను బాగా జరుపుకుంటారు.
దిశ, వెబ్ డెస్క్ :హిందూవులు పూర్ణిమ పండుగలను బాగా జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమను ఏడాదిలో ఆరవ పౌర్ణమిగా భావిస్తారు. ప్రతి ఏటా జూన్ నెలలో మాత్రమే వస్తుంది. ఈ పౌర్ణమిని వైశాఖ పూర్ణిమ అంటారు. ఈ రోజున ఎలాంటి పూజలు చేస్తే శుభం కలుగుతుందో? ఈ పూర్ణిమ యొక్క శుభ సమయాలు ఇక్కడ చూద్దాం..
నేటి నుంచి ఈ పూర్ణిమ మొదలవుతుంది. కొందరు ఈ రోజున భక్తి శ్రద్దలతో చంద్రుడికి పూజలు చేస్తారు. ఉదయాన్నే లేచి పూజ చేసుకొని, రోజంతా ఉపవాసం ఉండి,రాత్రి పూట పూజ చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగుతాయట. అంతే కాకుండా ఆర్ధికంగా కూడా లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు.
జ్యేష్ఠ మాస పౌర్ణమి తిథి రోజు : జూన్ 4
ప్రారంభ తేది: జూన్ 03 ఉదయం 11:16 గంటల నుంచి మొదలవుతుంది.
ముగింపు సమయం: జూన్ 04 ఉదయం 09:11 గంటల వరకు ఉంటుంది.