Karma Siddhantam: కర్మ అంటే ఏమిటి? కర్మ సిద్ధాంతం నిజమేనా?
కర్మ అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము.
దిశ, వెబ్ డెస్క్ : కర్మ అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము. అలాగే మన పెద్ద వాళ్లు కూడా కొన్ని సమయాల్లో కర్మ అనే ప్రస్తావన తీసుకొస్తుంటారు. అసలు కర్మ అంటే ఏమిటి ? కర్మ సిద్ధాంతం నిజమేనా ? కర్మ అనేది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుందా?
మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితం ఇస్తుందని కర్మ సిద్ధాంతం చెబుతుంది. ఎప్పుడైనా మనం తప్పుగా ఆలోచించి అడుగు వేసినా, పని చేసినా మాట్లాడినా.. అదే నెగటివ్ ఎనర్జీ మనకి తగులుతుంది. కానీ ఇది శిక్ష అనుకుంటే మీ పొరపాటే. కర్మ సిద్ధాంతం గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు ..కానీ ఎవరు దీనిని పట్టించుకోరు. మరి కొందరికి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాలిసింది..జరగక మానదు.అలాగే జరగాలి అని రాసి ఉన్న దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. జరిగే దాన్ని ఆపలేరు. కొన్ని మనం ప్రయత్నం చేసిన జరగదని అర్ధం. సాధారణంగా ప్రతి యొక్కరు సంతోషం, ప్రేమ , స్నేహం కోరుకుంటారు. మనస్ఫూర్తిగా కోరుకుంటే ప్రేమని, సంతోషాన్ని , నిజమైన స్నేహితులను పొందగలరు.
జీవితం తనంతట తాను ముందుకు వెళ్ళదు. మన పాత్ర ఉంటేనే ముందుకు సాగుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకోకుండా మీకు నచ్చినట్టు మీరు ఉండాలి. ఏదయినా మార్పు కోరుతున్నపుడు దాన్ని అంగీకరించాలి. మానవత్వంతో మెలిగినప్పుడే జీవితంలో పైకి రాగలరు. ఎంత కష్ట పడితే అంత ప్రతి ఫలం పొందుతారు. కర్మ అనేది పాజిటివ్ పనులను సూచిస్తుంది. ఈ సృష్టిలో ఒకే ఒక సిద్ధాంతం ఉన్నది .. అదే కర్మ సిద్ధాంతం. మన భావనలే మన యదార్దాలవుతాయని వివరించేదే కర్మ.
Read more: