అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. టికెట్ ధర ఎంతో తెలిస్తే ఖంగు తినాల్సిందే!

ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఆరాధ్య దేవుడు రాముడు.

Update: 2024-01-09 07:38 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఆరాధ్య దేవుడు రాముడు. ఒకప్పుడు రాముడు పుట్టిన చోట గుడి ఉండేది. దానిని ఒకప్పటి రాజులు కూల్చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడున్నర సంవత్సరాల తర్వాత ఇక్కడ రామాలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ పర్వదినం ఎప్పుడెప్పుడు వస్తుందా అని అక్కడి హిందూ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి మూడు నెలలు ముందుగానే చాలా మంది హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఆలయ ప్రారంభానికి చాలా మందికి ఆహ్వానాలు అందాయి. దీంతో ప్రజలు వెళ్లడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.

తాజాగా, అందుతున్న సమాచారం ప్రకారం విమానం టికెట్ బుక్ చేసుకోవడానికి ఎక్కవు మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో అనే రెండు విమానయాన సంస్థలు మాత్రమే అయోధ్యకు విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో అయోధ్య రామాలయం చేరుకోవడానికి జనవరి 19కి విమానం టికెట్ ఒక్కటి రూ. 20, 700గా ఉందట. అలాగే జనవరి 20కి రూ. 20 వేల ధర ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. అయోధ్యకు పోవడానికి ఖర్చు చేసే డబ్బుతో ఇతర ప్రాంతాల్లో సందర్శించి రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News