స్టైలిష్ దేవుడు.. ఆ ఆలయంలో గడియారం, సిగరెట్ సమర్పించి మొక్కులు తీర్చుకోవాల్సిందే..
దేవాలయాలకు వెళ్లేటప్పుడు ఎవరైనా కొబ్బరి కాయలు, పసుపుకుంకుమ, అగర్బత్తులు, పువ్వులు తీసుకెళ్లి దేవునికి మొక్కి వస్తారు. ఏదైనా కోరికలు ఉంటే ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేసి కొబ్బరికాయలు కొడతారు.
దిశ, వెబ్‌డెస్క్ : దేవాలయాలకు వెళ్లేటప్పుడు ఎవరైనా కొబ్బరి కాయలు, పసుపుకుంకుమ, అగర్బత్తులు, పువ్వులు తీసుకెళ్లి దేవునికి మొక్కి వస్తారు. ఏదైనా కోరికలు ఉంటే ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేసి కొబ్బరికాయలు కొడతారు. అలాగే దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటారు. కోరికలు తీరిన తరువాత మొక్కలు చెల్లించుకుంటారు. అయితే కొన్ని ఆలయాలలో మాత్రం కోరికలు కోరుకునేటప్పుడ కొన్ని వింత ఆచారాలను పాటిస్తారు. కోరికలు తీరిన తరువాత కూడా అంతే వింతగా మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి ఒక ఆలయం గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలయం ఎక్కడ ఉంది, ఎలాంటి ఆచారాలు ఆ ఆలయంలో పాటిస్తారో చూద్దాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో అన్హెల్ రోడ్డులో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరాలని బాబాముందు ‘సిగరెట్’వెలగిస్తారట. అప్పుడు ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. కోరికలు తీరిన తరువాత భక్తులు ఓ గడియారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకుంటారట. కోరికలు తీరిన తరువాత సమర్పించే గడియారాలతో మర్రిచెట్టు పూర్తిగా నిండిపోయి ఉండడంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ అనే శబ్దంతో మారుమోగిపోతుంది. అందుకే ఈ దేవుడిని ఇక్కడి వారు గడియారం దేవుడుగా పిలుస్తారు. అన్ని ఆలయాల్లో లాగా ఈ ఆలయంలో పూజారులు కూడా ఎవ్వరూ ఉండరు. ఈ ఆలయం పేరు పెద్దదే అయినా ఆలయం మాత్రం చాలా చిన్నగా ఉంటుందట. ఓ మర్రిచెట్టుకింద యక్షుడే దేవుడుగా కొలువై ఉన్నాడట. ఈ ఆలయం 10 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిందట. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీరడంతో ఆ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. భక్తులు ఈ మర్రిచెట్టుకు కట్టిన గడియారాలను ఎవరూ కూడా దొంగిలించలేదట.