Brahma Temple: ప్రపంచంలో ఒకే ఒక్క బ్రహ్మ దేవుడి గుడి ఇదే.. ఎక్కడ ఉందంటే..?

క్రీస్తు శకం 14 వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు.

Update: 2025-01-08 04:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : మనకి ఖాళీ సమయం దొరికితే కంచి నుంచీ.. కాశ్మీర్ వరకూ.. అన్నీ చుట్టేసి వస్తాము. దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత.. అక్కడే ప్రసాదం స్వీకరించి.. కొంత సేపు కూర్చొని తిరిగి వెళ్తుంటాం. అయితే, ఆ టెంపుల్స్ వెనక అంతు చిక్కని ఎన్నో రహస్యాలుంటాయి. వాటిన ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దేవ దేవుళ్లు నడిచిన ఈ పవిత్ర భూమి పై ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే అన్ని గుళ్లూ ఒకేలా ఉండవు. కొన్ని వింతగా ఉంటే మరి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్నైతే అసలు నమ్మశక్యంగా ఉండవు. బ్రహ్మ దేవుడికి ( Brahma Temple) ఆలయం ఉందన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇది వినడానికి షాకింగా ఉన్నా .. ప్రపంచంలో ఒకే ఒక్క గుడి బ్రహ్మ దేవుడికి కట్టించారు. అదెక్కడో ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం.. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు.. వరల్డ్ లో ఒకే ఒక్క ఆలయం ఉంది. అది రాజస్థాన్‌ పుష్కర్ ( Pushkar) లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14 వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఔరంగజేబు పరి పాలించిన కాలంలో .. ఎన్నో ఆలయాలు ధ్వంసమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, పుష్కర్‌లో నిర్మించిన ఆలయాలన్నీ పూర్తిగా కూలిపోయాయి. అయితే అంత విపత్తు జరిగినా.. బ్రహ్మ ఆలయం మాత్రం స్థిరంగా ఉంది. ఔరంగజేబు అనుచరులెవరూ దాని వైపు కూడా చూడకపోవడం విశేషం. పాలరాయితో చెక్కిన ఈ ఆలయం లోపలి గోడలకు.. భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన.. వెండి నాణేలు అమర్చారు. 

Tags:    

Similar News