తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..!

కలియుగ వైకుంఠం తిరుమలలో ఇటీవలే స్పల్పంగా భక్తుల రద్దీ తగ్గిన విషయం తెలిసిందే.

Update: 2023-04-15 03:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో ఇటీవలే స్పల్పంగా భక్తుల రద్దీ తగ్గిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి వరకూ(ఏప్రిల్ 14)తిరుమలకు నడచి వెళ్లే భక్తులకు గాలిగోపురం, కాలిబాట వద్ద టోకెన్లు జారీ చేశారు. అయితే దైవదర్శనం టోకెన్లు రోజుకు 8 వేల వరకూ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఒకరోజు కోటా పూర్తయిన వెంటనే మరుసటి రోజు టోకెన్లు కూడా జారీ చేసేందుకు అనుమతి ఇచ్చారు.

శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటికే ఆ విధానం అమలులో ఉంది. కాగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈరోజు(ఏప్రిల్ 15) నుంచి టోకెన్లు జారీ చేస్తున్నారని అధికారులు ప్రకటించడంతో భక్తులుపెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో పాటు తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజు సత్రంలోనూ టోకెన్లు జారీ చేస్తారు. కాగా.. గాలి గోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకుంటేనే దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు.  


ఇవి కూడా చదవండి:

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..  

Tags:    

Similar News