శక్తిపీఠాలు ఎలా వెలిశాయో తెలుసా..

భారతదేశంలోని మహిళలు ఎక్కువగా శక్తి స్వరూపిని అయిన పార్వతీ దేవిని ఎక్కువగా కొలుస్తారు.

Update: 2022-10-15 10:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలోని మహిళలు ఎక్కువగా శక్తి స్వరూపిని అయిన పార్వతీ దేవిని ఎక్కువగా కొలుస్తారు. పురాణ గాథల ప్రకారం అమ్మవారిని కొలిచే స్థలాలను శక్తి పీఠాలుగా పేర్కొంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తి పీఠాలు ఎన్ని అనే విషయం గురించి మాత్రం ఇప్పటికీ విభేదాలున్నాయి. అయితే శక్తి పీఠాల్లో 18 శక్తిపీఠాలు అని, అలాగే 51 అని, 52 అని, 108 శక్తిపీఠాలు అని వేర్వేరు లెక్కలున్నాయి. అయితే వీటిలో ప్రధానమైన శక్తి పీఠాలు 18 అని అంటారు. ఈ శక్తి పీఠాలు సతీదేవి అంటే పార్వతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాల్లో వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తి పీఠాలు భారత దేశంలో మాత్రమే కాకుండా దాయాదిదేశమైన పాకిస్తాన్, అలాగే శ్రీలంక, నేపాల్ వంటి మూడు దేశాలలో కూడా వెలశాయి. వాటితో ఒకటి కాశ్మీర్ లో ఉండగా, మరొకటి శ్రీలంకలో ఉంది.

పురాణ కథ

మన పురాణాల ప్రకారం శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఒక విషాధ గాథ ఉంది. విధాత, చతుర్ముఖుడు బ్రహ్మదేవునికి యాబై మూడు మంది కుమార్తెలుండేవారు. అలాగే పది మంది కుమారులు ఉండేవారు. వారిలో దక్షప్రజాపతి ఒకరు. బ్రహ్మదేవుడు కుమార్తెలను చంద్రునికి ఇరవై ఏడు మందిని, దుర్ముణకు పది మందిని, పితురులకు ఒకరిని, కశ్యప మహర్షికి పదమూడు మందని, అగ్నికి ఒకరిని ఇచ్చి వివాహం చేసారు. చివరికి సతీదేవి (పార్వతి) మిగిలింది. అయితే సతీదేవికి చిన్ననాటి నుంచి ఆ భోలాశంకరుడు అంటే అపారమైన భక్తి. కానీ దక్షప్రజాపతికి మాత్రం శివయ్య అంటే కోపం. దాంతో సతీదేవిని ఈశ్వరునికి ఇచ్చి వివాహం జరిపించడానికి ఇష్టపడడు.

అయినా సరే సతీదేవి తన తండ్రి మాటను లెక్కచేయకుండా ఆ గరళకంఠున్ని పెళ్ళాడింది. దీంతో దక్షప్రజాపతి శివునిపై మరింత కోపం, ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు దక్షప్రజాపతి బృహస్పతియాగం చేయడానికి సన్నాహాలు చేస్తాడు. ఈ యాగానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించాడు, కానీ కన్నకూతురైన పార్వతీ దేవి, అల్లుడు శివయ్యని మాత్రం యాగానికి ఆహ్వానించడు. యాగం విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమధగణాలను తనవెంటబెట్టుకుని యాగానికి తరలింది. కానీ అక్కడ పార్వతీదేవి ఎంతో అవమానానికి గురయ్యింది. ఆమెను అవమానించడం మాత్రమే కాకుండా దక్షుడు ఈ పరమశివున్నికూడా ధూషిస్తాడు. శివనిందను సహించలేని పార్వతి యాగాగ్నిలో భస్మమైంది.

విషయం తెలసుకున్న శివుడు ఆగ్రహించి తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. సతీ వియోగాన్ని తట్టుకోలేని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. అప్పుడు శ్రీ మహా శిష్ణువు దేవతల ప్రార్థనలు మన్నించి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేశాడు. శివుడిని కర్తవ్యోన్ముఖుడిని కావాలని హితం పలికాడు. ఎప్పుడయితే విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేశాడో అప్పుడు ఆ శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా వెలిశాయి. అయితే ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత శివుని తోడుగా దర్శనమిస్తుంది.

Tags:    

Similar News