మహా శివరాత్రి రోజు ఎందుకు జాగరణ చేయాలో తెలుసా?
మహా శివరాత్రి ఎంతో పర్వదినం అయిన రోజు. ఈ రోజు జాగరణ చేస్తే ఎంతో మంచిదంటారు పండితులు. శివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే శివరాత్రి నాడు
దిశ, వెబ్‌డెస్క్ : మహా శివరాత్రి ఎంతో పర్వదినం అయిన రోజు. ఈ రోజు జాగరణ చేస్తే ఎంతో మంచిదంటారు పండితులు. శివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు జాగరణ ఉండాలని అంటారు. అసలు మహా శివరాత్రి రోజు ఎందుకు జాగరణ ఉండాలి, ఎందుకు ఉపాసం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మహా శివరాత్రిని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి, శివభక్తులు మహా శివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారంట. ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. ఈరోజున రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచినవారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరు. ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జీవులు వేగంగా విస్తరించారు. అందుకే వీరంతా వెన్నెముక నిటారుగా ఉండే అవకాశాన్ని పొందారు.అలాగే గరుడ, స్కంద, పద్మ, అగ్ని పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో.. వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు. మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు.