హోలీని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
హోలీ పండుగ అంటే చాలా మందికి ఇష్టం. వివిధ రంగులతో చాలా సరదాగా మన స్నేహితులతో గడుపుతాం. ఇక మన హిందూమతంలో హోలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా
దిశ, ఫీచర్స్ : హోలీ పండుగ అంటే చాలా మందికి ఇష్టం. వివిధ రంగులతో చాలా సరదాగా మన స్నేహితులతో గడుపుతాం. ఇక మన హిందూమతంలో హోలీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళిలా దేశమంతా హోలీ పండుగను జరుపుకుంటారు. ఇక మార్చి 8న హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే అసలు హోలీ ఎందుకు జరుకుంటారు అనే డౌట్ వచ్చిందా?కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతను తన సోదరి హోలికను ప్రహ్లాదుని ఒడిలో పెట్టుకొని అగ్నిలో కూర్చొమ్మని చెబుతాడు. ఎందుకంటే బ్రహ్మదేవుని వరంతో హోలిక బట్టల్లో ఒకదానిక కాలకుండా ఉండే శక్తి ఉంటుంది. ఆ ధైర్యంతో హోలిక ప్రహ్లాదున్ని ఒడిలో కూర్చొబెట్టుకొని మంటల్లో ఉంటుంది. వారు మంటల్లో కూర్చోగా, బలమైన గాలుల వేగానికి ఆ వస్త్రం ప్రహ్లాదుని కప్పివేయడంతో హోలిక మంటల్లో కాలి బూడిదైంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు.కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిబూడిదైపోతుంది.అలా హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.