Yadagirigutta : కార్తీక మాసం ఎఫెక్టు..యాదగిరిగుట్టలో సత్యనారాయణ వ్రతాల షెడ్యూల్ లో మార్పులు

యాదగిరిగుట్ట దేవస్థానం(Yadagirigutta Templ) నందు కార్తీక మాసం(Kartika month)లో భక్తుల సౌకర్యార్థం సత్యనారాయణ స్వామి వ్రతాల(Satyanarayan Vrats) బ్యాచ్ ల సంఖ్యను పెంచుతున్నట్లుగా ఈవో భాస్కర్ రావు(EO Bhaskara Rao) వెల్లడించారు.

Update: 2024-10-29 12:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట దేవస్థానం(Yadagirigutta Templ) నందు కార్తీక మాసం(Kartika month)లో భక్తుల సౌకర్యార్థం సత్యనారాయణ స్వామి వ్రతాల(Satyanarayan Vrats) బ్యాచ్ ల సంఖ్యను పెంచుతున్నట్లుగా ఈవో భాస్కర్ రావు(EO Bhaskara Rao) వెల్లడించారు. ప్రస్తుతం 4 బ్యాచ్ లుగా నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతాలను కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిత్యం 6 బ్యాచ్ లుగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కొండ క్రింద వ్రత మంటపంలోని హల్స్ 1, 2లలో రోటేషన్ పద్దతిన వ్రతాలను నిర్వహిస్తారని పేర్కొన్నారు. మొదటి బ్యాచ్ ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు, రెండో బ్యాచ్ 9నుంచి 10గంటల వరకు, మూడో బ్యాచ్ 11గంటల నుంచి 12గంటల వరకు, నాల్గవ బ్యాచ్ మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు, ఐదవ బ్యాచ్ 3గంటల నుంచి 4గంటల వరకు, ఆరవ బ్యాచ్ సాయంత్రం 5నుంచి 6గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. కార్తీక శుద్ధ పూర్ణిమ పర్విదినం నవంబర్ 15వ తేదీన ఉదయం 5.30గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు 8 బ్యాచ్ లు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న 3 బ్యాచ్ లకు అదనంగా మరో రెండు బ్యాచ్ లు పెంచి కార్తీక మాసంలో నిత్యం 5 బ్యాచ్ లలో వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. పాతగుట్టలో ఉదయం 7గంటలకు, 9గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు, 2గంటలకు, సాయంత్రం 4గంటలకు ఐదు బ్యాచ్ లుగా వ్రతాలు కొనసాగనున్నాయన్నారు. కార్తీక పూర్ణిమ రోజున ఆరు బ్యాచ్ లలో వ్రతాలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 7గంటలకు, 9గంటలకు, 11గంటలకు, మధ్యాహ్నం 1గంటకు, 3గంటలకు, సాయంత్రం 5గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 6:30గంటలకు శివాలయం నందు ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. యాదగిరిగుట్ట ప్రధానాలయంలో దీపావళి రోజున నిత్య కైంకర్యాలలో స్వల్ప మార్పులు చేసినట్లుగా, సుప్రభాతం టికెట్లు రద్దు చేసినట్లుగా తెలిపారు.

Tags:    

Similar News