Tirumala Samacharam: తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. నేరుగా శ్రీవారి దర్శనం

కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది.

Update: 2024-10-30 02:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala) క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం శ్రీవారిని దర్శనానికి జనం చాలా తక్కువ సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్న వారు దర్శనానికి వేచి చూడాల్సిన పని లేదు. అదేవిధంగా బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లో భక్తులు ఎవరూ లేకపోవడంతో టీటీడీ అధికారులు నేరుగా దర్శనానికి పంపుతున్నారు.

మంగళవారం స్వామి వారిని 59,140 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 16,937 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.3.31 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News