Chitragupta Temple: హైద్రాబాద్లో చిత్రగుప్తుడికి ఆలయం ఉందని తెలుసా.. ఎక్కడంటే..?

యమధర్మ రాజు వద్ద పాపాలు చిట్టా చూసేది ఈయనే

Update: 2024-01-02 11:03 GMT

దిశ,ఫీచర్స్: చిత్ర గుప్తుడు పేరు వినే ఉంటారు. యమధర్మ రాజు వద్ద పాపాలు చిట్టా చూసేది ఈయనే. ఆయనకు ఒక ఆలయం ఉందన్న విషయం మనలో చాలా మందికి తెలీదు. మృత్యు దేవుడైన యమధర్మరాజుకు ఆలయాలు ఉన్నప్పటికి ఆయన అనుచరుడైన చిత్ర గుప్తునకు ఆలయాలు లేకపోతే ఎలా.. ? ఈ లోటు తీర్చడానికే హైద్రాబాద్ పాత బస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ కు సమీపంలో కందికల్ గేట్ రోడ్ లో చిత్ర గుప్త మహాదేవుడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని సుమారు రెండున్నర శతాబ్దాల క్రితం నిర్మించినట్లుగా భావిస్తున్నారు. ఈ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి. ఇక చిత్ర గుప్తునకు నోము కూడా ఉంటుంది. పాప ప్రక్షాళన జరిగి ఆయుష్షును పెంచుకునేందుకు ఈ నోము నోస్తారు. ఇక స్త్రీ లు సుమంగళిత్వం కోసం నోమును నోచుకుంటారు. ఈ ఆలయంలో చిత్ర గుప్తుడితో పాటు ఆయన దేవేరులు, ఆయన సంతానం విగ్రహాలు కూడా ఉన్నాయి. కాయత్వం వంశస్థులు తమ కుల దైవంగా చిత్ర గుప్తుడిని కొలుస్తుంటారు.


Similar News