శబరిమల ఆలయానికి భారీగా పెరిగిన అయ్యప్ప స్వాములు రద్దీ.. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం
కార్తికమాసం పూర్తవ్వడంలో అయ్యప్ప స్వాములు.. మాల విరమణ కోసం శబరిమల( Sabarimala)కు చేరుకుంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కార్తికమాసం పూర్తవ్వడంలో అయ్యప్ప స్వాములు.. మాల విరమణ కోసం శబరిమల( Sabarimala)కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కేరళ(kerala)లోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల(devotees) రద్దీ భారీగా పెరిగింది. దీంతో అయ్యప్ప దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. నిన్న రాత్రి కూడా భక్తులు భారీగా చేరుకోవడంతో పంబ నుండి సన్నిధానం వరకు క్యూ లైన్లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు. అయితే భక్తుల రద్దీని ముందుగానే ఉహించిన ఆలయ అధికారులు, స్థానిక ప్రభుత్వం.. రోజుకు 90 వేల మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో భక్తుల రద్దీ తక్కువగా ఉండేది కాదు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం అయ్యప్ప భక్తులను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా.. ఉన్న అన్ని ప్రధాన రైల్వే మార్గాల నుంచి కొట్టాయమ్ కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. దీంతో శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి భారీగా పెరిగిపోయినట్లు తెలుస్తుంది. కాగా పెరిగిన రవాణా సౌకర్యాల వల్ల రోజుకు 50 వేలకు పైగా అయ్యప్ప స్వాములు.. మాల విరమణ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.