Akshaya Tritiya: ఇవాళ బంగారం కొంటున్నారా?
భారతీయులు ఎంతో నిష్టగా జరుపుకునే పండుగ అక్షయ తృతీయ.
దిశ, వెబ్ డెస్క్: భారతీయులు ఎంతో నిష్టగా జరుపుకునే పండుగ అక్షయ తృతీయ. ఈ రోజు (ఏప్రిల్ 22న శనివారం హిందువులు కచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. దీని తిథి ఈరోజు ఉదయం 7:49 నిమిషాలకు మొదలై రేపు ఉదయం 7:47 నిమిషాలకు ముగుస్తుంది. అయితే అక్షయ తృతీయ నాడు ఏ సమయంలో బంగారం కొంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం 7:49 నుండి ఏప్రిల్ 23 ఉదయం 05: 48 వరకు మీరు బంగారాన్ని కొనుగోలు చేసుకుంటే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అక్షయ తృతీయ నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీ దేవిని పూజించి ఆ తర్వాత ఏదైనా శుభకార్యాలను జరుపుకుంటే ఈ ఏడాదంతా శుభం జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. ఈరోజున బంగారం కొంటే సిరిసంపదలు వస్తాయని నమ్ముతారు. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం పూర్వ కాలం నుండి వస్తున్న సంప్రదాయంగా కొనసాగుతుంది.