కరోనా సంక్షోభంలో కూడా కానుకలు సమర్పించారు
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలైంది. దేశంలోని అన్ని కార్యకలాపాలు సుమారు రెండు నెలలపాటు నిలిచిపోయాయి. ఆదాయం లేక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామికి కూడా ఆర్థిక సంక్షోభం తాకింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా భక్తుల విశ్వాసం సడలలేదు. తిరుమల వేంకటేశ్వరుడి దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోకపోయినా కానుకలు సమర్పించడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆన్‌లైన్, గోవిందం యాప్ ద్వారా […]
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలైంది. దేశంలోని అన్ని కార్యకలాపాలు సుమారు రెండు నెలలపాటు నిలిచిపోయాయి. ఆదాయం లేక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామికి కూడా ఆర్థిక సంక్షోభం తాకింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా భక్తుల విశ్వాసం సడలలేదు. తిరుమల వేంకటేశ్వరుడి దర్శన భాగ్యానికి భక్తులు నోచుకోకపోయినా కానుకలు సమర్పించడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆన్‌లైన్, గోవిందం యాప్ ద్వారా తోచినంత స్వామివారికి సమర్పించుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఆన్‌లైన్ హుండీకి ఈ మార్గంలో 90 లక్షల రూపాయలు జమకాగా, కరోనా వైరస్ సంక్షోభంలో ఉన్నప్పటికీ గత నెలలో కూడా అంతే మొత్తం కానుకలు రావడం విశేషం.