మల్లన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులు
దిశ, మెదక్: లాక్‌డౌన్ సడలింపులతో తెరచుకున్న కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజు 500 మంది భక్తులు దర్శించుకోగా, 9, 10 తేదీల్లో వెయ్యి చొప్పున భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. 8న 695 లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు, 9న 898 లడ్డూలు, 457 పులిహోర ప్యాకెట్లు, 10న సాయంత్రం నాలుగు గంటల వరకు 600 లడ్డూలు, 300 పులిహోర ప్యాకెట్లు విక్రయించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో కొందరు నిబంధనలు పాటించకపోవడంతో […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ సడలింపులతో తెరచుకున్న కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజు 500 మంది భక్తులు దర్శించుకోగా, 9, 10 తేదీల్లో వెయ్యి చొప్పున భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. 8న 695 లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు, 9న 898 లడ్డూలు, 457 పులిహోర ప్యాకెట్లు, 10న సాయంత్రం నాలుగు గంటల వరకు 600 లడ్డూలు, 300 పులిహోర ప్యాకెట్లు విక్రయించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో కొందరు నిబంధనలు పాటించకపోవడంతో ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఆందోళనకు గురవుతున్నారు.