తాడేపల్లి రాజప్రసాదానికి మాటలు వినపడుతున్నాయా?: దేవినేని

దిశ, ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా విధుల్లో నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి ట్విట్టర్ మాధ్యమంగా గుర్తు చేస్తూ, ‘కోర్టు తీర్పులను ఎందుకు అమలుచేయటం లేదు? ఏపీ ప్రభుత్వానికి ఏమైంది? గవర్నర్ జోక్యం చేసుకోవాలా.. ఇదేం తీరు? కేసుపై మాకు అవగాహన ఉంది? ఏపీలో అసలేం జరుగుతోంది? ఎవరు చెప్పినా వినం మా పాలన మా ఇష్టమంటున్న తాడేపల్లి రాజప్రసాదానికి ఈ […]

Update: 2020-07-25 03:15 GMT

దిశ, ఏపీ బ్యూరో: నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా విధుల్లో నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి ట్విట్టర్ మాధ్యమంగా గుర్తు చేస్తూ, ‘కోర్టు తీర్పులను ఎందుకు అమలుచేయటం లేదు? ఏపీ ప్రభుత్వానికి ఏమైంది? గవర్నర్ జోక్యం చేసుకోవాలా.. ఇదేం తీరు? కేసుపై మాకు అవగాహన ఉంది? ఏపీలో అసలేం జరుగుతోంది? ఎవరు చెప్పినా వినం మా పాలన మా ఇష్టమంటున్న తాడేపల్లి రాజప్రసాదానికి ఈ మాటలు వినబడుతున్నాయా? ముఖ్యమంత్రి జగన్ గారు’ అని అడిగారు.

మరో ట్వీట్‌లో ‘జోరు తగ్గని కరోనా.. 8,147కేసులు, 49 మరణాలు నమోదు. ఊపిరి పోస్తారని వస్తే ఉసురే పోయింది. లక్షణం ఉంటే వైద్యం అందదంతే. కాళ్లా వేళ్లా పడినా వైద్యం అందని దుస్థితి ప్రభుత్వానికి కనబడుతుందా? జగన్‌ గారు ఆరు నెలలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కాదు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి’ అంటూ నిలదీశారు.

Tags:    

Similar News