'దేవి' చేయడం గర్వంగా ఉంది : శృతి
దిశ, వెబ్‌డెస్క్: శృతి హాసన్.. యాక్టర్‌గా, మ్యుజీషియన్‌గా, సింగర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న శృతి … హిందీలో ‘దేవి’ అనే షార్ట్ ఫిల్మ్‌లో తొలి సారి నటించింది. కాజోల్, నేహాధూపియా లాంటి స్టార్స్ నటించిన ఈ షార్ట్ పిల్మ్… సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఉంటుంది. మార్చి 2న రిలీజ్ అయిన ‘దేవి’ యూట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: శృతి హాసన్.. యాక్టర్‌గా, మ్యుజీషియన్‌గా, సింగర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజా రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్న శృతి … హిందీలో ‘దేవి’ అనే షార్ట్ ఫిల్మ్‌లో తొలి సారి నటించింది. కాజోల్, నేహాధూపియా లాంటి స్టార్స్ నటించిన ఈ షార్ట్ పిల్మ్… సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఉంటుంది. మార్చి 2న రిలీజ్ అయిన ‘దేవి’ యూట్యూబ్‌లో 10 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది శృతి. ‘దేవి’ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా, గర్వంగా ఉందని ట్వీట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా చాలా మందిని చేరడం… ఆలోచించేలా చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రియాంక బెనర్జీ దర్శకత్వం వహించిన ‘దేవి’ సినిమాను ఎలక్ట్రిక్ ఆపిల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
‘దేవి’ సినిమాను చూసిన ప్రతీ ఒక్కరు సమాజంలో జరుగుతున్న యదార్థగాథల్ని చూపించిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఈ రోజు ఒకరికి అన్యాయం జరిగి న్యాయం కోసం పోరాటం చేస్తున్నా… అదే అన్యాయం దేశంలోని మరో మూల జరుగుతుందని… అలాంటి సంఘటనలనే సినిమాలో చూపించారని చెబుతున్నారు. ఈ సినిమా చూశాక సమాజంలో జీవించేందుకు భయమేస్తోందంటున్నారు. మొత్తానికి ‘దేవి’ సినిమా ద్వారా సొసైటీకి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చారని అభినందిస్తున్నారు.
Tags: Shruthi Hassan, Devi, Youtube, 10Million Views, Kajol, Neha Dhupiya