జామాయిల్ తోటలో ఉన్న మహంకాళి విగ్రహం.. అలా ఎందుకు చేశారు ?

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవపూర్ గ్రామములోని మహంకాళి గుడిలో విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయి. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో జామాయిల్ తోటలో ఉన్న మహంకాళి గుడిలోని అమ్మవారి విగ్రహం, నవగ్రహా విగ్రహాలతో సహా ఇతర విగ్రహాలను, దేవతామూర్తి విగ్రహం పై ఉన్న వస్తువులు చీర తదితర వస్తువులను తగలబెట్టి ధ్వంసం చేశారు. గతంలో గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ, కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఇదే తరహా విగ్రహాలను ధ్వంసం […]

Update: 2021-10-21 01:47 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రాఘవపూర్ గ్రామములోని మహంకాళి గుడిలో విగ్రహాలు ధ్వంసానికి గురయ్యాయి. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో జామాయిల్ తోటలో ఉన్న మహంకాళి గుడిలోని అమ్మవారి విగ్రహం, నవగ్రహా విగ్రహాలతో సహా ఇతర విగ్రహాలను, దేవతామూర్తి విగ్రహం పై ఉన్న వస్తువులు చీర తదితర వస్తువులను తగలబెట్టి ధ్వంసం చేశారు. గతంలో గ్రామంలోని పోచమ్మ, మైసమ్మ, కంఠమహేశ్వర స్వామి ఆలయంలో ఇదే తరహా విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి నిన్న రాత్రి మహంకాళి గుడిలో విధ్వంసం చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్, ఆర్ ఎస్ ఎస్ సభ్యులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ సర్పంచ్ కుమారుడిని అనుమానిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News