మొబైల్ యూజర్స్‌కు… మూడో కన్ను

దిశ, ఫీచర్స్: ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు అంతర్భాగంగా మారాయని కొత్తగా చెప్పనవసరం లేదు. ‘స్మార్ట్ ఫోన్’ వచ్చాక పదిమందిలో ఉన్న తలలు మాత్రం స్క్రీన్‌వైపే చూస్తుంటాయి. భోజనం చేస్తున్నా.. దృష్టి, ధ్యాసం మాత్రం మొబైల్ పైనే. చిన్నారుల నుంచి వయోధిక వృద్ధుల వరకు చాలామంది ప్రతిరోజూ హ్యాండ్‌హెల్డ్స్‌ను చూస్తూ గంటలు గడుపుతున్నారు. మరికొందరైతే రోడ్డు దాటుతున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్న వేళ కూడా మొబైల్‌లోనే బతుకుతుంటారు. ఇది ఎంత ప్రమాదమో వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఎవరెన్ని చెప్పినా.. మొబైల్‌లోనే […]

Update: 2021-05-20 02:36 GMT

దిశ, ఫీచర్స్: ఆధునిక జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు అంతర్భాగంగా మారాయని కొత్తగా చెప్పనవసరం లేదు. ‘స్మార్ట్ ఫోన్’ వచ్చాక పదిమందిలో ఉన్న తలలు మాత్రం స్క్రీన్‌వైపే చూస్తుంటాయి. భోజనం చేస్తున్నా.. దృష్టి, ధ్యాసం మాత్రం మొబైల్ పైనే. చిన్నారుల నుంచి వయోధిక వృద్ధుల వరకు చాలామంది ప్రతిరోజూ హ్యాండ్‌హెల్డ్స్‌ను చూస్తూ గంటలు గడుపుతున్నారు. మరికొందరైతే రోడ్డు దాటుతున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్న వేళ కూడా మొబైల్‌లోనే బతుకుతుంటారు. ఇది ఎంత ప్రమాదమో వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఎవరెన్ని చెప్పినా.. మొబైల్‌లోనే ముఖం దూర్చేవారి కోసమే అన్నట్లుగా ఇండస్ట్రియల్ డిజైన్ స్టూడెంట్ మిన్‌వుక్ పాంగ్ ఓ హైటెక్ థర్డ్ ఐ (మూడో కన్ను) సృష్టించాడు.

చాలామంది తమ ఫోన్‌లను చూస్తూ.. నీటి ఫౌంటెన్‌లు లేదా గుంతల్లో పడే ఫన్నీ క్లిప్‌లను మనం చాలానే చూశాం. ఇలాంటి పరిస్థితిని అనుభవించి వాళ్లు కూడా మనలో ఉండొచ్చు. రోడ్డు దాటే వేళ మొబైల్ చూస్తూ ప్రమాదాల బారిన పడ్డవాళ్లకు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ‘మిన్‌వుక్ పాంగ్ ఓ స్మార్ట్ థర్డ్ ఐ’ని రూపొందించాడు. ఇది ధరించి నిశ్చింతగా రోడ్డు దాటుతూ ఇన్‌స్టాగ్రామ్‌ను టెక్స్ట్ చేయవచ్చు. లేదా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయవచ్చు. ‘థర్డ్ ఐ’ని వ్యక్తి నుదిటిపై జెల్ ప్యాడ్‌ సాయంతో అవలీలగా అతికించవచ్చు. దాన్ని ధరించి నడుస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్‌లోనే అడ్డంకులను చూడవచ్చు.

మూడో కన్ను ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ కేస్ కలిగి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కంటి లోపల చిన్న స్పీకర్, గైరోస్కోపిక్ సెన్సార్, సోనార్ సెన్సార్ ఉన్నాయి. ఈ డివైజ్ ధరించిన వారి తల కిందికి చూస్తున్నప్పుడు గైరోస్కోప్ గుర్తించి మూడో కన్నును ఓపెన్ చేస్తుంది. వెంటనే అతడి ముందు ఉన్న ప్రాంతాన్ని అది పర్యవేక్షించడం ప్రారంభిస్తుంది. ఇది అడ్డంకిని గుర్తించిన వెంటనే కనెక్ట్ చేసిన స్పీకర్ ద్వారా ధరించినవారిని బజర్ సౌండ్‌తో హెచ్చరిస్తుంది.

“చెడు భంగిమలో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం ద్వారా, ‘టర్టిల్ నెక్ సిండ్రోమ్ ’ వస్తుందని తెలుసు. కానీ మనం దాన్ని లెక్కచేయకుండా అలానే కూర్చుంటాం. నడుస్తున్నప్పుడు ఫోన్ చూస్తే ప్రమాదాలు జరుగుతాయి. కానీ అప్రయత్నంగానే ఫోన్‌‌నే చూసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటాం. ఈ క్రమంలోనే స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. వాటికి ప్రత్నామ్నాయాలు కూడా వస్తాయి. కానీ రాబోయే కాలంలో పరికరాలతో నిండిన ‘ఫోనో సేపియన్స్‌’గా పూర్తిగా భిన్నమైన, మానవజాతికి చెందిన కొత్త రూపాన్ని చూస్తాం’ అని మిన్‌వుక్ పాంగ్ అభిప్రాయపడ్డాడు.

లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఇంపీరియల్ కాలేజీలో పెంగ్ తన ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్ డిగ్రీలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్ మానవులు “ఫోనో సేపియన్స్” గా ఎలా అభివృద్ధి చెందుతున్నారనే దానిపై సెటరైకిల్ లుక్ (వ్యంగ్య రూపాన్ని)ను అందిస్తుంది.

Tags:    

Similar News