‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులేసిన డిప్యూటీ సీఎం భార్య..
దిశ, ఏపీబ్యూరో : బుల్లెట్టు బండి పాట బుల్లెట్ లాగే దూసుకుపోతోంది. వేడుక ఏదైనా ఈ బుల్లెట్ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. బుల్లెట్టు బండి పాట లేనిదే పెళ్లిళ్లు.. ఇతర ఫంక్షన్లు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా.. డుగ్గు డుగ్గు’ అంటూ ఈ పాట నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి 70 ఏళ్ల బామ్మల వరకు ఈ పాటకు స్టెప్పులేసేస్తూ అందర్నీఆకట్టుకుంటున్నారు. తాజాగా ఏపీ […]
దిశ, ఏపీబ్యూరో : బుల్లెట్టు బండి పాట బుల్లెట్ లాగే దూసుకుపోతోంది. వేడుక ఏదైనా ఈ బుల్లెట్ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. బుల్లెట్టు బండి పాట లేనిదే పెళ్లిళ్లు.. ఇతర ఫంక్షన్లు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. అందాల దునియానే చూపిత్తపా.. డుగ్గు డుగ్గు’ అంటూ ఈ పాట నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి 70 ఏళ్ల బామ్మల వరకు ఈ పాటకు స్టెప్పులేసేస్తూ అందర్నీఆకట్టుకుంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి కూడా ఇదే పాటకు స్టెప్పులేశారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు వేడుకలు నిర్వహించారు. అయితే, ఈ వేడుకల్లో నారాయణ స్వామి సతీమణితో పాటు బంధువులు బుల్లెట్టు పాటకు డ్యాన్స్ చేశారు. భార్య డ్యాన్స్ చేస్తుండగా డిప్యూటీ సీఎం సోఫాలో కూర్చుని తెగ మురిసిపోయారు. డ్యాన్స్ వేసి వేసి చివరకు ఆమె డిప్యూటీ సీఎం నారాయణ పక్కన వాలిపోయారు. ఈ పాటను కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. మెుత్తానికి ఈ పాట మరోసారి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.