వాయుగుండంగా మారిన అల్పపీడనం

దిశ, వెబ్‎డెస్క్: బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. పారాదీప్(ఒడిశా)కు 180, సాగర్‌ దీవుల (పశ్చిమ బెంగాల్‌)కు 320, ఖైపుపారా (బంగ్లాదేశ్‌)కు 490 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చే 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. శుక్రవారం సాయంత్రం సాగర్‌దీవులకు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండంతో రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. […]

Update: 2020-10-22 20:53 GMT

దిశ, వెబ్‎డెస్క్: బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. పారాదీప్(ఒడిశా)కు 180, సాగర్‌ దీవుల (పశ్చిమ బెంగాల్‌)కు 320, ఖైపుపారా (బంగ్లాదేశ్‌)కు 490 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చే 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. శుక్రవారం సాయంత్రం సాగర్‌దీవులకు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండంతో రానున్న మూడు రోజులు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, తెలంగాణలో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News