Police Recruitment:త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ.. స్పష్టం చేసిన హోంమంత్రి
రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం(AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీస్ శాఖ(Police Department)లో ఖాళీల భర్తీ చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anita) స్పష్టం చేశారు. పోలీసు, జైళ్లు, న్యాయశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమర్ధంగా పనిచేసేలా తమ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. అటు ప్రత్యేక, ఫాస్ట్‌ట్రాక్, ఏసీబీ కోర్టుల ద్వారా మహిళలకు సత్వర న్యాయం అందించేలా న్యాయవ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.