సగం ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేదు.. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రస్తుతానికి అన్ని పడకలకు ఆక్సిజన్సదుపాయం కల్పించలేదు. వైద్య, విద్య, వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 130 హాస్పిటల్స్ లో కేవలం సగం బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉన్నట్లు ఆధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ రెండు విభాగాల హస్పిటల్స్ లో 27,141 బెడ్లు ఉండగా, ప్రస్తుతం కేవలం 10,224కు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉన్నది. మరో 16,917 బెడ్లకు కూడా ఆక్సిజన్ గా మార్చాలని నిర్ణయం తీసుకోగా, ఆరు వేల […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రస్తుతానికి అన్ని పడకలకు ఆక్సిజన్సదుపాయం కల్పించలేదు. వైద్య, విద్య, వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 130 హాస్పిటల్స్ లో కేవలం సగం బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉన్నట్లు ఆధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఈ రెండు విభాగాల హస్పిటల్స్ లో 27,141 బెడ్లు ఉండగా, ప్రస్తుతం కేవలం 10,224కు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉన్నది. మరో 16,917 బెడ్లకు కూడా ఆక్సిజన్ గా మార్చాలని నిర్ణయం తీసుకోగా, ఆరు వేల బెడ్లకు ఆక్సిజన్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వైద్యాధికారులు వివరిస్తున్నారు. వేగంగా ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పినా.. అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన జరుతున్నాయి.
దీంతో పాటు థర్ద్ వేవ్ లో చిన్నారులు ఇన్ ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కొవిడ్ కమిటీ సభ్యుల అభిప్రాయాలతో ప్రత్యేక పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 6 వేల బెడ్లను పిల్లలకు చికిత్సను అందించేందుకు సిద్ధం చేశామన్నారు. వీటిలో 1875 ఐసీయూ బెడ్లకు హెచ్ఎఫ్ఎన్ సీ, సికాప్బీ పాప్ మానిటర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇక నిలోఫర్ లో 2000 బెడ్లలో 500 ఐసీయూ, 1500 బెడ్లకు ఆక్సిజన్‌ను కల్పించామన్నారు. ఒక వేళ పేషెంట్ల సంఖ్య పెరిగితే నిలోఫర్ లో అదనపు బెడ్లను కూడా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాల్లోనూ పీడియాట్రిక్ బెడ్లను అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు.