ప్రైవేట్ స్కూళ్లకు కీలక ఆదేశాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్ ఫీజులు పెంచొద్దు అని తేల్చి చెప్పింది. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు హైదరాబాద్ డీఈవో వెంకట నర్సమ్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నెల వారీగా మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయవచ్చాని డీఈవో తెలిపారు. నిబంధలు ఉల్లంఘిస్తే ఆ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు […]

Update: 2020-06-27 08:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యాశాఖ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్ ఫీజులు పెంచొద్దు అని తేల్చి చెప్పింది. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు హైదరాబాద్ డీఈవో వెంకట నర్సమ్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా నెల వారీగా మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయవచ్చాని డీఈవో తెలిపారు. నిబంధలు ఉల్లంఘిస్తే ఆ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. అలాగే, ఫీజులు కట్టిన వారికే ఆన్ లైన్ క్లాస్‌లు అంటే సహించేది లేదన్నారు. పాఠశాల యాజమాన్యాలు వేధిస్తే ఫిర్యాదు చేయాలని డీఈవో వెంకట నర్సమ్మ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.

Tags:    

Similar News