టెన్షన్.. టెన్షన్.. డెంగీ కొత్త రకం వచ్చిందా?

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధిలో కొత్త రకం వచ్చిందేమోనని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరగడానికి కారణాలేమిటీ? అనే విషయాలను తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే డెంగీ వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కేసులను పరిశీలిస్తున్నారు. ఫీవర్​, నిలోఫర్​ ఆసుపత్రుల సందర్శన అనంతరం అక్కడ విషమ స్థాయిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక వారి రక్తనమునాలను జీనోమ్​ సీక్వెన్సీకి పంపించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూత్రపాయంగా నిర్ణయించారు. ఇప్పటికే […]

Update: 2021-10-06 19:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధిలో కొత్త రకం వచ్చిందేమోనని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెరగడానికి కారణాలేమిటీ? అనే విషయాలను తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే డెంగీ వ్యాధితో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కేసులను పరిశీలిస్తున్నారు. ఫీవర్​, నిలోఫర్​ ఆసుపత్రుల సందర్శన అనంతరం అక్కడ విషమ స్థాయిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక వారి రక్తనమునాలను జీనోమ్​ సీక్వెన్సీకి పంపించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూత్రపాయంగా నిర్ణయించారు.

ఇప్పటికే క్రిటికల్​ స్టేజ్​ లో ఉన్న రోగుల వివరాలను ఆయా ఆసుపత్రుల అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో డెంగీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2019లో సుమారు 13 వేలకు పైగా కేసులు తేలినట్టు అధికారిక లెక్కలు చెబుతుండగా.. ఈ ఏడాది ఇప్పటికే 4 వేల కేసులు దాటిపోయాయి. దీంతో ప్రజలతో పాటు అధికారులు టెన్షన్​ కు గురవుతున్నారు.

Tags:    

Similar News