ఏసీబీ పేరిట డబ్బులు డిమాండ్.. అరెస్టు చేసిన పోలీసులు

దిశ, చిట్యాల: ఏసీబీ ఆఫీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నానని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్న ఓ వ్యక్తిని రేగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వీణవంక మండలం కనపర్తి గ్రామనికి చెందిన పత్తి శ్రీనివాస రెడ్డి ఏసీబీ ఆఫీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నానని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులను కొంత కాలంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మొగుళ్లపల్లి మండలానికి చెందిన పంచాయితీ రాజ్ ఏఈ వడ్లకొండ […]

Update: 2021-06-16 10:59 GMT

దిశ, చిట్యాల: ఏసీబీ ఆఫీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నానని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్న ఓ వ్యక్తిని రేగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వీణవంక మండలం కనపర్తి గ్రామనికి చెందిన పత్తి శ్రీనివాస రెడ్డి ఏసీబీ ఆఫీసులో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నానని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులను కొంత కాలంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మొగుళ్లపల్లి మండలానికి చెందిన పంచాయితీ రాజ్ ఏఈ వడ్లకొండ శ్రీనివాస్‌పై ఏసీబీ ఆఫీస్‌లో ఫిర్యాదులు నమోదు అయ్యాయని బెదిరించాడు. తదుపరి విచారణ జరగకుండా ఉండాలంటే రూ.1.50 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సదరు ఏఈ రేగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజుల్లోనే నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రూ. 20 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శ్రీనివాస రెడ్డి ఎలాంటి ఏసీబీ ఆఫీసులో పనిచేయడంలేదని, అక్రమాలకు పాల్పడుతున్న డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని సీఐ పులి వెంకట్ గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News