వరవరరావును వెంటనే విడుదల చేయాలి
దిశ, న్యూస్బ్యూరో: తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వరవరరావును బెయిల్పై వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. 80 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ కూడా వచ్చినట్లు చూపారని, అనేక కుట్ర కేసులు ఎదుర్కొని అన్నింటిలోనూ నిర్దోషిగా నిరూపితమైందని వివరించారు. మానవీయ దృష్టితో ఆలోచించి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని వేదిక కోరింది. వరవరరావును వెంటనే […]
దిశ, న్యూస్బ్యూరో: తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వరవరరావును బెయిల్పై వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. 80 ఏళ్ల వయసులో ఉన్న ఆయనకు కరోనా పాజిటివ్ కూడా వచ్చినట్లు చూపారని, అనేక కుట్ర కేసులు ఎదుర్కొని అన్నింటిలోనూ నిర్దోషిగా నిరూపితమైందని వివరించారు. మానవీయ దృష్టితో ఆలోచించి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని వేదిక కోరింది.
వరవరరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. సంతకాలు చేసిన వారిలో కె.లక్ష్మయ్య, టి.శుభాకరరావు, జి సదానందం గౌడ్, పి.పర్వతరెడ్డి, కె.జంగయ్య, చావ రవి, సీహెచ్ సంపత్కుమారస్వామి, జి.బాలస్వామి, కె రమణ, మైస శ్రీనివాసులు, ఎం.రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, కె.కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్, ఎం.రాధాకృష్ణ, చంద్రశేఖర్, తాజ్ మోహన్ రెడ్డి, యూ.పోచయ్య, డి.సైదులు, జి.ఉపేందర్, జె.వెంకటేష్, పి.భాస్కర్, షౌకత్ అలీ, బి.కొండయ్య, ఎస్.విఠల్, ఎండి ఖమ్రొద్దీన్, మల్లీశ్వరి ఉన్నారు.