‘డెల్టా ప్లస్’ యమడేంజర్.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో నెమ్మదిగా డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 డెల్టా కేసులు నమోదైనట్లు స్పష్టంచేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో-23, మధ్యప్రదేశ్‌లో-11, తమిళనాడులో 10కి పైగా, తెలంగాణలోనూ రెండు వేరియంట్లు వెలుగుచూసినట్లు కేంద్రం తెలిపింది. డెల్టా వేరియంట్ ప్లస్ వైరస్‌‌తో వెయ్యి రెట్లు ఎక్కువగా వైరల్ లోడ్ ఉంటుందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ప్రజలు కూడా డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని […]

Update: 2021-07-31 00:20 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో నెమ్మదిగా డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 డెల్టా కేసులు నమోదైనట్లు స్పష్టంచేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో-23, మధ్యప్రదేశ్‌లో-11, తమిళనాడులో 10కి పైగా, తెలంగాణలోనూ రెండు వేరియంట్లు వెలుగుచూసినట్లు కేంద్రం తెలిపింది.

డెల్టా వేరియంట్ ప్లస్ వైరస్‌‌తో వెయ్యి రెట్లు ఎక్కువగా వైరల్ లోడ్ ఉంటుందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ప్రజలు కూడా డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు తెలిపారు. ఇదిలాఉండగా యూరప్ ఖండంలోని సగానికి పైగా దేశాలు డెల్టా వేరియంట్ కోరల్లో చిక్కుకున్నట్లు WHO ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News