బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ.

దిశ, తిరుమలగిరి: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బీసీల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 80 శాతం కలిగిన బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత లేదని చెప్పారు. ఇప్పటికైనా పాలకులు బీసీ గణన చేపట్టి మా జనాభా ఎంతో మాకు వాటా కల్పించాలని డిమాండ్ […]

Update: 2021-12-09 07:53 GMT

దిశ, తిరుమలగిరి: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. బీసీల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 80 శాతం కలిగిన బీసీలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత లేదని చెప్పారు.

ఇప్పటికైనా పాలకులు బీసీ గణన చేపట్టి మా జనాభా ఎంతో మాకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాం ప్రభు, దయ యాదవ్, గిరి గౌడ్, అశోక్ ,లింగయ్య, వెంకన్న, లక్ష్మయ్య, ఐలయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..