ప్లాస్మా థెరఫీ కోసం ఢిల్లీ పోలీస్ డిజిటల్ డాటా బ్యాంక్

న్యూఢిల్లీ: కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ప్లాస్మా థెరఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాలా సందర్భాల్లో ప్లాస్మాథెరఫీ చేయించుకునే వారు డోనర్లకోసం తీవ్రంగా వెతకాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను తీర్చేందుకు ఢిల్లీ పోలీసులు ముందుకొచ్చారు. ప్లాస్మా థెరఫికి ఉపయోగపడేందుకు వీలుగా ప్లాస్మా డోనర్ల వివరాలతో కూడిన డిజిటల్ డాటా బ్యాంకును తయారు చేశారు. ఈ మేరకు జీవన్ రక్షక్ పేరిట గూగుల్‌లో ఆన్‌లైన్ ఫామ్ తయారు చేశారు. ప్లాస్మా కావాలనుకునే వారు.. ప్లాస్మా డొనేట్ చేయాలనుకునే వారు […]

Update: 2021-04-24 23:16 GMT

న్యూఢిల్లీ: కరోనా రోగుల ప్రాణాలను కాపాడటంలో ప్లాస్మా థెరఫీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే చాలా సందర్భాల్లో ప్లాస్మాథెరఫీ చేయించుకునే వారు డోనర్లకోసం తీవ్రంగా వెతకాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యను తీర్చేందుకు ఢిల్లీ పోలీసులు ముందుకొచ్చారు. ప్లాస్మా థెరఫికి ఉపయోగపడేందుకు వీలుగా ప్లాస్మా డోనర్ల వివరాలతో కూడిన డిజిటల్ డాటా బ్యాంకును తయారు చేశారు. ఈ మేరకు జీవన్ రక్షక్ పేరిట గూగుల్‌లో ఆన్‌లైన్ ఫామ్ తయారు చేశారు. ప్లాస్మా కావాలనుకునే వారు.. ప్లాస్మా డొనేట్ చేయాలనుకునే వారు ఈ మేరకు ఢిల్లీ పోలీస్ వెబ్‌సైట్‌లోని లింకుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో దాతలు, గ్రహితలు ఒకరితో ఒకరు కాంటాక్ట్ కావడానికి సులభంగా వీలుకలుగుతుంది. కాగా పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Tags:    

Similar News