ఢిల్లీలో కరోనా కలకలం.. మంత్రి కైలాష్ గెహ్లోట్ కు కరోనా నిర్దారణ
దిశ, వెబ్ డెస్క్: కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. సినీ , రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటీకే పలువురు నేతలు కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ రవాణా, న్యాయశాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయినట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ” ఈరోజు నాకు కరోనా పాజిటివ్ అని […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. సినీ , రాజకీయ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటీకే పలువురు నేతలు కరోనా బారిన పడిన విషయం తెల్సిందే. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ రవాణా, న్యాయశాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయినట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ” ఈరోజు నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.. వెంటనే నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యలో నన్ను కలిసినవారందరు పరీక్షలు చేయించుకొని, జాగ్రత్తగా ఉండవల్సిందిగా కోరుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే గత బుధవారమే మంత్రి కైలాష్ కొవిడ్-19 వ్యాక్సీన్ తొలి డోసు వేయించుకున్నారు.
I have tested positive for Covid-19 today. I have home isolated myself. All those who came in contact with me recently please take necessary precautions.
— Kailash Gahlot (@kgahlot) April 14, 2021