కస్టమర్‌కు షాక్.. కారు బొమ్మ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా..

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వ్యక్తి తన కుమారుడి కోసం అమెజాన్ ఈ కామర్స్ ద్వారా రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిచ్చాడు. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత.. తనకు వచ్చిన పార్సిల్ విప్పి చూడగ, దానిలో ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. దీంతో కస్టమర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. భగవాన్ నగర్ ఆశ్రమ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ బురాగోహైన్ అనే వ్యక్తికి ఎదురైంది అనుభవం. దీన్ని అతడు సోషల్ […]

Update: 2021-06-22 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఓ వ్యక్తి తన కుమారుడి కోసం అమెజాన్ ఈ కామర్స్ ద్వారా రిమోట్ కంట్రోల్ కారు బొమ్మ ఆర్డరిచ్చాడు. ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత.. తనకు వచ్చిన పార్సిల్ విప్పి చూడగ, దానిలో ‘పార్లే-జీ’ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. దీంతో కస్టమర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. భగవాన్ నగర్ ఆశ్రమ్ ప్రాంతానికి చెందిన విక్రమ్ బురాగోహైన్ అనే వ్యక్తికి ఎదురైంది అనుభవం. దీన్ని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అమెజాన్‌లో మనం ఆర్డరిచ్చిన దానికి బదులు పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ వస్తే.. ఇక చాయ్ పెట్టుకోవాలి’ అని కాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. దీనిపై అమెజాన్‌కు ఫిర్యాదు చేశానని, వాళ్లు స్పందించారని విక్రమ్ తెలిపాడు. తను చెల్లించిన సొమ్మును రిఫండ్ చేసే ప్రక్రియ మొదలైందని వెల్లడించాడు.

Tags:    

Similar News