థర్డ్ వేవ్‌ను అధిగమించాం: ఢిల్లీ మంత్రి
న్యూఢిల్లీ: కరోనా కేసులతో సతమతమవుతున్న దేశరాజధానిలో మరోసారి లాక్‌డౌన్ విధించాలని భావించడం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. ఢిల్లీ, థర్డ్ వేవ్‌ను అధిగమించిందని, కాబట్టి మళ్లీ లాక్‌డౌన్ ఉండదని తెలిపారు. లాక్‌డౌన్ ఇప్పుడు ప్రభావవంతమైన నిర్ణయం కాదని, అందరూ మాస్కులు ధరించడంతో మెరుగైన ప్రయోజనం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల కరోనా కేసులున్న ఢిల్లీ వారం రోజులుగా దేశంలోనే అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర […]
న్యూఢిల్లీ: కరోనా కేసులతో సతమతమవుతున్న దేశరాజధానిలో మరోసారి లాక్‌డౌన్ విధించాలని భావించడం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. ఢిల్లీ, థర్డ్ వేవ్‌ను అధిగమించిందని, కాబట్టి మళ్లీ లాక్‌డౌన్ ఉండదని తెలిపారు. లాక్‌డౌన్ ఇప్పుడు ప్రభావవంతమైన నిర్ణయం కాదని, అందరూ మాస్కులు ధరించడంతో మెరుగైన ప్రయోజనం ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం సుమారు నాలుగు లక్షల కరోనా కేసులున్న ఢిల్లీ వారం రోజులుగా దేశంలోనే అత్యధిక కేసులతో అగ్రస్థానంలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్‌తో సమావేశమయ్యారు. టెస్టులను రెట్టింపు చేయడం, డీఆర్‌డీవో సెంటర్‌లో 750 ఐసీయూ బెడ్‌లను కేటాయించడం వంటి నిర్ణయాలను తీసుకున్నారు.