అన్‌లాక్‌కు అడ్డొస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన రెండు నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మోకాలడ్డారు. హోటళ్ల రీఓపెన్, సిటీలోని మార్కెట్లు ఒక వారం తెరిచి ట్రయల్ వేయాలని భావించగా, అనిల్ బైజాల్ అభ్యంతరం చెప్పారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చీఫ్ బైజాల్ ఢిల్లీలో ఈ నిర్ణయాలు అమలు చేయరాదని అన్నారు. ఢిల్లీలో ఇంకా కరోనా ముప్పు ముగియలేదని, ఇంకా పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయని పేర్కొంటూ […]
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన రెండు నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మోకాలడ్డారు. హోటళ్ల రీఓపెన్, సిటీలోని మార్కెట్లు ఒక వారం తెరిచి ట్రయల్ వేయాలని భావించగా, అనిల్ బైజాల్ అభ్యంతరం చెప్పారు.
ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ చీఫ్ బైజాల్ ఢిల్లీలో ఈ నిర్ణయాలు అమలు చేయరాదని అన్నారు. ఢిల్లీలో ఇంకా కరోనా ముప్పు ముగియలేదని, ఇంకా పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయని పేర్కొంటూ ఆయన అభ్యంతరపెట్టారు. యాక్టివ్ కేసుల్లో ఢిల్లీ 11వ స్థానంలో ఉన్నదని, ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలపై దృష్టిపెట్టాల్సిన అవసరమున్నదని కేజ్రీవాల్ సర్కారు స్పందించింది. ఢిల్లీ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం మానేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.