ఎమ్మెల్యేలకు వేతనాలు పెంచిన ఢిల్లీ సర్కార్

దిశ, వెబ్‌డెస్క్ : శాసనసభ్యులకు వేతనాలు పెంచుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలను ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేల బేసిక్ పే రూ.12వేల నుంచి 30 వేలకు పెరిగింది. అలవెన్సులతో కలుపుకుని ఒక్కో ఎమ్మెల్యే వేతనం రూ.90 వేలకు పెరగనుంది. ఇదిలాఉండగా ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు విషయంలో కేజ్రీవాల్ సర్కార్ పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాగా, దేశంలోనే ప్రజాప్రతినిధులకు ఎక్కువ వేతనం రూ.2,50,000 చెల్లిస్తున్న […]

Update: 2021-08-03 04:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : శాసనసభ్యులకు వేతనాలు పెంచుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలను ఢిల్లీ కేబినెట్ ఆమోదించింది. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేల బేసిక్ పే రూ.12వేల నుంచి 30 వేలకు పెరిగింది.

అలవెన్సులతో కలుపుకుని ఒక్కో ఎమ్మెల్యే వేతనం రూ.90 వేలకు పెరగనుంది. ఇదిలాఉండగా ప్రజాప్రతినిధులకు వేతనాల పెంపు విషయంలో కేజ్రీవాల్ సర్కార్ పై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాగా, దేశంలోనే ప్రజాప్రతినిధులకు ఎక్కువ వేతనం రూ.2,50,000 చెల్లిస్తున్న ప్రభుత్వాల్లో తెలంగాణ టాప్‌లో ఉండగా.. రూ. 40 వేల తక్కువ వేతనంతో త్రిపుర రాష్ట్రం చివరలో నిలిచింది.

Tags:    

Similar News