ఆ పోలీసు శాంతికాముకుడు

దిశ, వెబ్‌డెస్క్ : నార్త్ ఢిల్లీ జిల్లాలో సీఏఏ వ్యతిరేకులు, అనుకూలురుల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లలో ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ సోమవారం ప్రాణాలుకోల్పోయారు. రతన్‌లాల్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మా నాన్న చేసిన తప్పేంటి అని అతని ముగ్గురు పిల్లలు అమాయకంగా ప్రశ్నిస్తుండటం అందరిని కదిలిస్తున్నది. రతన్‌లాల్ గొడవలకు దూరంగా ఉండేవాడని, శాంతికాముకడని అతని సోదరులు, సహచరులు గుర్తుచేసుకున్నారు. దయల్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆందోళనకారుల ఘర్షణలో రతన్‌లాల్ సోమవారం […]

Update: 2020-02-24 23:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నార్త్ ఢిల్లీ జిల్లాలో సీఏఏ వ్యతిరేకులు, అనుకూలురుల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లలో ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్ సోమవారం ప్రాణాలుకోల్పోయారు. రతన్‌లాల్ మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మా నాన్న చేసిన తప్పేంటి అని అతని ముగ్గురు పిల్లలు అమాయకంగా ప్రశ్నిస్తుండటం అందరిని కదిలిస్తున్నది. రతన్‌లాల్ గొడవలకు దూరంగా ఉండేవాడని, శాంతికాముకడని అతని సోదరులు, సహచరులు గుర్తుచేసుకున్నారు. దయల్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆందోళనకారుల ఘర్షణలో రతన్‌లాల్ సోమవారం మరణించారు. రాజస్తాన్ సికార్ జిల్లాకు చెందిన రతన్‌లాల్ 2004లో జైపూర్‌కు చెందిన పూనమ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. సద్ధి, కణక్, రామ్ ముగ్గురూ 15 ఏళ్లలోపువారే.

Tags:    

Similar News