కరోనా కట్టడికి 5 'టీ' మంత్రం: ఢిల్లీ ప్రభుత్వం
మంత్రంతో ఐదు స్టెప్పుల్లో కరోనా విస్తరణకు చెక్ పెట్టొచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని హాట్ స్పాట్ లలో ర్యాండమ్ గా సుమారు లక్షమందికి కరోనా టెస్టులు నిర్వహిస్తామని వివరించారు. తబ్లిఘీ జమాత్ ఈవెంట్ లో పాల్గొన్న వారి ఫోన్ నెంబర్లను పోలీసులు ఇస్తామని, వారి కదలికలను ట్రేస్ చేసి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. కరోనా కట్టడి కోసం […]
మంత్రంతో ఐదు స్టెప్పుల్లో కరోనా విస్తరణకు చెక్ పెట్టొచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని హాట్ స్పాట్ లలో ర్యాండమ్ గా సుమారు లక్షమందికి కరోనా టెస్టులు నిర్వహిస్తామని వివరించారు. తబ్లిఘీ జమాత్ ఈవెంట్ లో పాల్గొన్న వారి ఫోన్ నెంబర్లను పోలీసులు ఇస్తామని, వారి కదలికలను ట్రేస్ చేసి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.
కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఒక వ్యూహం రూపొందించిందని.. అదే 5 ‘టీ’ల ప్లాన్ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. 5 ‘టీ’లలో మొదటిది టెస్టింగ్ అని చెప్పారు. టెస్ట్ నిర్వహించకుంటే ఏ ఇంట్లోకి ఈ వైరస్ ప్రవేశించిందో కనిపెట్టలేమన్నారు. దాంతో వైరస్ అలాగే వ్యాప్తి చెందుతూ వెళుతుందని తెలిపారు. సౌత్ కొరియా ప్రతి పౌరునికి పరీక్షలు జరిపి కరోనాను కట్టడి చేయగలిగిందని చెప్పారు. ఢిల్లీ కూడా అలాగే పెద్ద మొత్తంలో టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైందని వివరించారు. ఢిల్లీలో కరోనా కేసులు 500 మార్కును దాటిన విషయం తెలిసిందే. ఏడుగురు మరణించగా 19 మంది రికవరీ అయ్యారు.
ఢిల్లీ ప్లాన్ లోని ఐదు ‘టీ’ అర్థం ఇదే..
1. ర్యాండమ్ ‘టెస్టింగ్’
2. కాంటాక్ట్ ల ‘ట్రేసింగ్’
3. పాజిటివ్ కేసుల ‘ట్రీట్మెంట్’
4. ‘టీం వర్క్’
5. ‘ట్రాకింగ్’ మరియు మానిటరింగ్
Tags: Delhi, 5T plan, strategy, random tests, cm arvind Kejriwal