మైనర్ బాలిక కిడ్నాప్​ కేసులో నిందితుడు రిమాండ్​

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కేపీహెచ్​బీ కాలనీ వసంత్​ నగర్​ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికను కిడ్నాప్​ చేసిన కేసులో నిందితుడు నల్లమిడి సిసింద్రి(23)ని కేపీహెచ్​బీ పోలీసులు సోమవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక ప్రాంతానికి చెందిన పితాని లక్ష్మి గోకుల్​ ప్లాట్స్​లో నివాసం ఉంటు స్థానికంగా వాచ్​మెన్​గా పని చేస్తుంది. ఇదిలా ఉండగా లక్ష్మీ కూతురు గత నెల రోజులుగా వసంత్​నగర్​ […]

Update: 2021-08-23 11:26 GMT

దిశ, కూకట్​పల్లి: కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కేపీహెచ్​బీ కాలనీ వసంత్​ నగర్​ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికను కిడ్నాప్​ చేసిన కేసులో నిందితుడు నల్లమిడి సిసింద్రి(23)ని కేపీహెచ్​బీ పోలీసులు సోమవారం అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక ప్రాంతానికి చెందిన పితాని లక్ష్మి గోకుల్​ ప్లాట్స్​లో నివాసం ఉంటు స్థానికంగా వాచ్​మెన్​గా పని చేస్తుంది. ఇదిలా ఉండగా లక్ష్మీ కూతురు గత నెల రోజులుగా వసంత్​నగర్​ కాలనీలో నివాసం ఉంటున్న తన చెల్లెలు బి.లక్ష్మీ ఇంట్లో ఉంటుంది.

కాగా లక్ష్మీ కూతురు (15) ఈ నెల 8వ తేదిన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తన పిన్ని పిల్లలు అయిన గణేష్​, మహేష్​లతో కలిసి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. రాత్రి వరకు బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద గాలించిన ఫలితం లేక పోయింది. బాలిక తల్లి లక్ష్మీకి సమాచారం అందించడంతో అదే రోజు కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలికను నల్లమిడి సిసింద్రి కిడ్నాప్​ చేసినట్టు గుర్తించారు. నిందితుడిపై 164 సీఆర్​పీసీ ఐపీసీ 376(2)(ఎన్), పోస్కో సెక్షన్​ 6, 5, ఐపీసీ 363 సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Tags:    

Similar News