ఏథెన్స్‌లో దీపిక విగ్రహం

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకొనే అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే. ముఖ్యంగా ఆ సొట్టబుగ్గతో వచ్చే చిరునవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఇండియన్ సినిమా అభిమానులు ఆమెకు స్టార్ రేంజ్‌ ఇచ్చి ఫస్ట్ ప్లేస్‌లో కూర్చోబెట్టగా.. ఆ స్మైల్‌కు భారత్ మాత్రమే కాదు ప్రపంచమే ఫిదా అవుతుందంటూ గ్రీస్ దేశం తనకు గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. అవును.. దీపిక ప్యూర్ స్మైల్‌‌ను ప్రశాంతత పంచే లిస్ట్‌లో చేరుస్తూ ఏథెన్స్ విమానాశ్రయం తన విగ్రహాన్ని ప్రతిష్టించింది. వరల్డ్ […]

Update: 2020-12-09 01:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా దీపికా పదుకొనే అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే. ముఖ్యంగా ఆ సొట్టబుగ్గతో వచ్చే చిరునవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. అందుకే ఇండియన్ సినిమా అభిమానులు ఆమెకు స్టార్ రేంజ్‌ ఇచ్చి ఫస్ట్ ప్లేస్‌లో కూర్చోబెట్టగా.. ఆ స్మైల్‌కు భారత్ మాత్రమే కాదు ప్రపంచమే ఫిదా అవుతుందంటూ గ్రీస్ దేశం తనకు గొప్ప గౌరవాన్ని కట్టబెట్టింది. అవును.. దీపిక ప్యూర్ స్మైల్‌‌ను ప్రశాంతత పంచే లిస్ట్‌లో చేరుస్తూ ఏథెన్స్ విమానాశ్రయం తన విగ్రహాన్ని ప్రతిష్టించింది. వరల్డ్ వైడ్‌గా ఉన్న అథెంటిక్ స్మైలింగ్ స్టార్స్‌‌తో పాటు మెడలో చోకర్ నెక్లెస్, బన్‌తో టై చేసిన హెయిర్, అందమైన స్మైల్‌తో ఉన్న దీపికా డార్క్ స్టోన్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించింది. కొవిడ్ కారణంగా మూతపడిన ఏథెన్స్ విమానాశ్రయం మళ్లీ తెరుచుకోగా.. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు, వారిలో పాజిటివిటీని నింపేందుకు ఈ బెస్ట్ స్మైలింగ్ స్టార్స్ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Tags:    

Similar News