దీపికా రెమ్యునరేషన్ డబుల్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ పూర్తి కాకుండానే తన 21వ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. దానికి కారణం మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్, బాలీవుడ్ భామ్ దీపకా పదుకునే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కింగ్ బాహుబలికి సరిజోడిగా క్వీన్ పద్మావతిని తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇక్కడే ఓ చిన్న హింట్ ఇచ్చినట్లు అర్థం అవుతుంది. అదేంటంటే రాజు, రాణి […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ పూర్తి కాకుండానే తన 21వ సినిమాపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. దానికి కారణం మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్, బాలీవుడ్ భామ్ దీపకా పదుకునే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కింగ్ బాహుబలికి సరిజోడిగా క్వీన్ పద్మావతిని తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇక్కడే ఓ చిన్న హింట్ ఇచ్చినట్లు అర్థం అవుతుంది. అదేంటంటే రాజు, రాణి అంటూ సంబోధిస్తున్నాడంటే కచ్చితంగా ఇది రాజుల నాటి కథే. అటు ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాతో రాజులా నటించాడు. ఇటు దీపికా పదుకునే పద్మావతి సినిమాతో రాణిలా ఒదిగిపోయింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ను కొల్లగొట్టాయి. రికార్డుల వర్షం కురిపించాయి. అంతేకాదు దీపికాకు హీరోలకు ఉన్నంత క్రేజ్ కూడా ఉంది. బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
మరి అలాంటి హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అది కూడా పాన్ ఇండియా, సోషియో ఫాంటసీ కథ కావడంతో దీపికా రెమ్యూనరేషన్ డబుల్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ 21వ మూవీ కోసం దీపిక ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దీపికా టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రికార్డులోకెక్కుతుంది. నాగ్ అశ్విన్ కూడా దీపికా పెట్టిన కండీషన్లకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో ప్రభాస్‌కు జోడిగా దీపికనే తీసుకోవాలనుకున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫైనల్ కాగా, నటీ నటులు, టెక్నిషియన్స్ ఎంపికపై దర్శకుడు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.