ముఖ్యమంత్రికి ప్రజాసంఘాల విజ్ఞాపన

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత మందికి చేరువయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలు ప్రజా సంఘాలు కోరాయి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ప్రభుత్వ సాయం అందరికీ అందడం లేదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని వలస కూలీలకు బియ్యం, ఆర్థిక సాయం అందడంలేదని తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలో 3.26 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్టు అంచనాతో […]

Update: 2020-04-11 04:34 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సమయంలో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత మందికి చేరువయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలు ప్రజా సంఘాలు కోరాయి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దని ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ప్రభుత్వ సాయం అందరికీ అందడం లేదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని వలస కూలీలకు బియ్యం, ఆర్థిక సాయం అందడంలేదని తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలో 3.26 లక్షల మంది వలస కూలీలు ఉన్నట్టు అంచనాతో వారందరికీ సాయం చేయాలని కోరాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కూడా రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, ఆర్థిక సాయం అందడం లేదని, వారికి కూడా రేషన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాలు కోరాయి. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను వెంటనే పరిష్కరించి వారికి జారీ చేయాలని సూచించాయి. ముఖ్యమంత్రికి విజ్ఞాపన చేసిన వారిలో రైతు స్వరాజ్య వేదిక, దళిత్ బహుజన్ ఫ్రంట్, మహిళా అధికార్ మంచ్, హ్యూమన్ రైట్స్ ఫోరం, ఎన్‌ఏపీఎం, అన్వేష్ రీసెర్చి సెంటర్ ఆఫ్ ఉమెన్స్ స్టడీస్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్ తదితర సంఘాలు, సామాజిక సంస్థలు ఉన్నాయి.

Tags: Migrant Workers, Ration Goods, Financial Aid, Ration Cards, Public Unions, CM

Tags:    

Similar News