లారీని ఢీ కొట్టిన డీసీఎం.. డ్రైవర్ పరిస్థతి విషమం

దిశ, నల్లగొండ: ఆగి ఉన్న లారీని అతి వేగంతో డీసీఎం ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం శివారులో విజయవాడ నుంచి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. బ్రేక్ డౌన్ కారణంగా రోడ్డుపై నిలిచిపోయింది. అదే మార్గంలో వచ్చిన డీసీఎం.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దాని వెనుకే వచ్చిన మరో డీసీఎం కూడా ముందున్న వాహనాన్ని ఢీ […]

Update: 2020-04-17 00:24 GMT

దిశ, నల్లగొండ: ఆగి ఉన్న లారీని అతి వేగంతో డీసీఎం ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం శివారులో విజయవాడ నుంచి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. బ్రేక్ డౌన్ కారణంగా రోడ్డుపై నిలిచిపోయింది. అదే మార్గంలో వచ్చిన డీసీఎం.. లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దాని వెనుకే వచ్చిన మరో డీసీఎం కూడా ముందున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు డీసీఎంలలోని డ్రైవర్లు క్యాబిన్​లోనే ఇరుక్కుపోయారు. పోలీసులు రెండో డీసీఎం డ్రైవర్​ను వెంటనే బయటకు తీయగలిగారు. కానీ, మొదటి డీసీఎం డ్రైవర్.. లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అనంతరం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Tags: DCM, hitting, lorry, stopped, Driver situation is poisonous, nalgonda

Tags:    

Similar News