పాక్‌లో అఫ్ఘాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్

కాబుల్: పాకిస్తాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి నజీబుల్లా అలీఖిల్ కుమార్తె సిల్సిలాను గుర్తుతెలియని దుండగులు ఇస్లామాబాద్‌లో కిడ్నాప్ చేశారు. ఆమెను కొన్ని గంటలపాటు బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను అఫ్ఘాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని జిన్నా మార్కెట్ నుంచి అద్దె వాహనంపై సిల్సిలా ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెను అపహరించి, కొన్ని గంటలపాటు హింసించారని తెలిపింది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఈ దారుణ ఘటనను […]

Update: 2021-07-17 10:28 GMT

కాబుల్: పాకిస్తాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ రాయబారి నజీబుల్లా అలీఖిల్ కుమార్తె సిల్సిలాను గుర్తుతెలియని దుండగులు ఇస్లామాబాద్‌లో కిడ్నాప్ చేశారు. ఆమెను కొన్ని గంటలపాటు బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను అఫ్ఘాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని జిన్నా మార్కెట్ నుంచి అద్దె వాహనంపై సిల్సిలా ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెను అపహరించి, కొన్ని గంటలపాటు హింసించారని తెలిపింది. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. ఈ దారుణ ఘటనను అఫ్ఘాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాక్‌లోని తమ దౌత్యవేత్తలు, వారి కుటుంబాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.

అలాగే, అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు అనుగుణంగా దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకు రక్షణ పెంచాలని కోరింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని, రాయబారి, వారి కుటుంబాలకు సెక్యూరిటీ పెంచామని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాగా, పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్‌ల మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతు పలుకుతున్నదని, వారికి కావాల్సిన సాయమూ చేస్తున్నదని అఫ్ఘాన్ ఆరోపించగా, తమ దేశంలో దాడి చేసే ఉగ్రవాదులకు అఫ్ఘాన్ ఆశ్రయం ఇస్తున్నది పాక్ ప్రత్యారోపణ చేసింది.

Tags:    

Similar News