కూతురు ప్రేమ పెళ్లి.. కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య
దిశ, సంగారెడ్డి : కూతురు ప్రేమ వివాహం తల్లిదండ్రుల ప్రాణాలను తీసింది. బాధ్యతాయుత ఉద్యోగం చేస్తున్నా.. కూతురు చేసిన పనికి తట్టుకోలేక పోయాడు ఆ తండ్రి. భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడో కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగిందీ ఘటన. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారాయణ, భార్య రాజేశ్వరి మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి కూతురు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. కూతురు ప్రేమ […]
దిశ, సంగారెడ్డి : కూతురు ప్రేమ వివాహం తల్లిదండ్రుల ప్రాణాలను తీసింది. బాధ్యతాయుత ఉద్యోగం చేస్తున్నా.. కూతురు చేసిన పనికి తట్టుకోలేక పోయాడు ఆ తండ్రి. భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడో కానిస్టేబుల్. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగిందీ ఘటన.
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ నారాయణ, భార్య రాజేశ్వరి మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి కూతురు వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. కూతురు ప్రేమ వివాహం తమ పరువు తీసిందని భావించిన దంపతులు తీవ్రమనస్థాపంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. నారాయణ ప్రస్తుతం జిన్నారం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.