స్నానానికి వెళ్లి వస్తా అన్న కూతురు.. బాత్ రూమ్‌లో చేసిన పనికి షాక్ అయిన తల్లిదండ్రులు
దిశ, జల్పల్లి: కూతురు తరచు ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆమెను మందలించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్భాస్కర్తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పోలోజు ఆంజనేయచారికి నలుగురు సంతానం. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న రెండవ కూతురు దివ్యశ్రీ (21) తరచు ఫోన్ మాట్లాడుతుందని తండ్రి గమనించి మందలించాడు. ఆమె ఫోన్‌ను లాక్కున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి […]
దిశ, జల్పల్లి: కూతురు తరచు ఫోన్లో మాట్లాడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆమెను మందలించాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాలాపూర్ ఇన్స్పెక్టర్భాస్కర్తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పోలోజు ఆంజనేయచారికి నలుగురు సంతానం. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న రెండవ కూతురు దివ్యశ్రీ (21) తరచు ఫోన్ మాట్లాడుతుందని తండ్రి గమనించి మందలించాడు. ఆమె ఫోన్‌ను లాక్కున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దివ్యశ్రీ సోమవారం మధ్యాహ్నం 1గంటలకు స్నానం చేసి వస్తానని బాత్రూమ్కి వెళ్ళింది. అరగంట అయినా తిరిగి రాకపోవడంతో తల్లి వెంటిలేటర్నుంచి చూడగా ఇనుప రాడ్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.