కరోనా బాధిత తండ్రికి కూతురు ఓదార్పు
దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచo కరోనా గుప్పిట్లో ఉంది. ఆ మహమ్మారి వేగంగా విస్తరిస్తూ.. ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎన్నో దేశలు విలవిల్లాడుతున్నాయి. వాటిలో ఇజ్రాయెల్ ఒకటి. అక్కడి టెల్ అవీవ్‌లో జరిగిన ఓ సంఘటన.. నెటిజన్లను , స్థానికులను ఆలోచింపచేస్తుంది. కరోనాతో బాధపడుతున్న తండ్రికి ఓ కూతురిచ్చిన ఓదార్పు వారితో కన్నీళ్లు పెట్టించింది. ఇటలీలో.. మృత్యు గంట మోగుతోంది.. జనాలు.. కరోనా భారిన పడి.. పిట్టల్లా రాలిపోతున్నారు. […]
దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచo కరోనా గుప్పిట్లో ఉంది. ఆ మహమ్మారి వేగంగా విస్తరిస్తూ.. ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎన్నో దేశలు విలవిల్లాడుతున్నాయి. వాటిలో ఇజ్రాయెల్ ఒకటి. అక్కడి టెల్ అవీవ్‌లో జరిగిన ఓ సంఘటన.. నెటిజన్లను , స్థానికులను ఆలోచింపచేస్తుంది. కరోనాతో బాధపడుతున్న తండ్రికి ఓ కూతురిచ్చిన ఓదార్పు వారితో కన్నీళ్లు పెట్టించింది.
ఇటలీలో.. మృత్యు గంట మోగుతోంది.. జనాలు.. కరోనా భారిన పడి.. పిట్టల్లా రాలిపోతున్నారు.
వైరస్ బారిన పడి ఆదివారం 651 మంది మృతిచెందారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 5,476కు చేరింది. మంగళవారానికి ఈ సంఖ్య 6077 కు చేరింది. ఈ రోజు మరణాలేమి సంభవించ లేవు. అయితే.. ఇటలీ లో ఓ తండ్రి, కూతుళ్ళ సంఘటన మాత్రం అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒపెరా గాయని ఇరిట్ స్టార్క్ తండ్రి మైఖేల్ స్టార్క్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఆయన అపార్టుమెంటు బాల్కనీలో ఉంటే.. ఇరిట్ ఆయనకు వినిపించేలా బయట నుంచి పాట పాడుతూ తండ్రికి ఓదార్పునిచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రయత్నం ఫలించింది. కూతురి పాట విన్న మైఖేల్ తన బాధనంతా మరచిపోయి చిరునవ్వు చిందిస్తూ చప్పట్లు కొట్టడం విశేషం. ఈ సంఘటనను చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇరిట్‌ని అభినందించారు.
Tags: italy, corona virus, deaths , irit stark, claps, song, father, daughter, relation , corona affect