మహిళతో సహజీవనం.. మోజు తీరాక స్నేహితుల కోరిక తీర్చాలంటూ…
దిశ, జడ్చర్ల : సహజీవనం ముసుగులో ఓ ఒంటిరి మహిళను వేధింపులకు గురి చేసిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వెంకటేశ్ కు.. జిల్లాకేంద్రానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్ళైన అతను తన భార్యకు ఉన్న అనారోగ్య సమస్యను కారణంగా చూపుతూ ఒక బిడ్డకు తల్లైన తనను కలిసి ఉందామని, ఇద్దరినీ బాగా చూసుకుంటానని నమ్మబలికాడని ఆరోపించింది. 8 నెలల పాటు తనతో […]
దిశ, జడ్చర్ల : సహజీవనం ముసుగులో ఓ ఒంటిరి మహిళను వేధింపులకు గురి చేసిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన వెంకటేశ్ కు.. జిల్లాకేంద్రానికి చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. అప్పటికే పెళ్ళైన అతను తన భార్యకు ఉన్న అనారోగ్య సమస్యను కారణంగా చూపుతూ ఒక బిడ్డకు తల్లైన తనను కలిసి ఉందామని, ఇద్దరినీ బాగా చూసుకుంటానని నమ్మబలికాడని ఆరోపించింది. 8 నెలల పాటు తనతో కలిసి సహజీవనం చేశాడని ఇటీవల ఏమైందో ఏమో కానీ తన స్నేహితుల మోజు తీర్చాలని కోరడంతో తను అంగీకరించలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మూడ్రోజుల క్రితం మాట్లాడుకుందాం రమ్మని జడ్చర్లకు పిలిపించుకుని కారులో ఎక్కించుకున్నాడని, దారిలో వెంకటేశ్ మరో ఇద్దరు స్నేహితులను ఎక్కించుకుని పాలమూరు పట్టణమంతా తనను కారులో కొట్టకుంటూ తిప్పారని ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాకుండా జడ్చర్ల దాబాకు వెళ్లి అక్కడ మరో ఇద్దరు స్నేహితులు కారు ఎక్కారని, అందరూ కలిసి తనను కొడుతూ హింసించారని వాపోయింది. చివరకు హత్యాప్రయత్నం కూడా చేయడానికి ప్రయత్నించడంతో అర్ధరాత్రి తరువాత వారి చెరనుంచి తప్పించుకుని, జిల్లాకేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని బాధిత మహిళ తెలిపింది. అక్కడ పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం జడ్చర్ల పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది. ఇక్కడ పోలీసులు పాలమూరుకే వెళ్ళాలని సూచించారాని, దీంతో తను న్యాయం కోసం జడ్చర్ల సిగ్నల్ గడ్డ దగ్గర ధర్నా చేసేందుకు అనుమతించాలని వేడుకుంటున్నానని తెలిపింది. తనలాగే మరో మహిళకు అన్యాయం జరగకుండా కఠినంగా శిక్షించేందుకే తను ఈ ధర్నా చేయాలని నిర్ణయించుకున్నానని, తనకు పోలీసులు సహకరించి న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనపై కేసు నమోదైనట్లు సమాచారం.