బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్నారు: దాసోజు శ్రవణ్
దిశ, తెలంగాణ బ్యూరో : ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారని, ఆ తర్వాత బిచ్చగాళ్లలా చూస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని, 27 శాతం బీసీలు ఉండాల్సిన చోట 8 శాతం సైతం లేరన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూలోనూ నియామకాలు, పీహెచ్‌డీలోనూ బీసీ స్కాలర్‌లకు అన్యాయం చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. ఇఫ్లూ అధ్యాపక నియామకాల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారని, ఆ తర్వాత బిచ్చగాళ్లలా చూస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని, 27 శాతం బీసీలు ఉండాల్సిన చోట 8 శాతం సైతం లేరన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూలోనూ నియామకాలు, పీహెచ్‌డీలోనూ బీసీ స్కాలర్‌లకు అన్యాయం చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. ఇఫ్లూ అధ్యాపక నియామకాల్లో బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, బీసీ కమిషన్ నోటీసులు పంపినా అధికారులు కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఆరోపణలు వచ్చినా నియమకాలను కొనసాగిస్తున్నారని, దీనిని గవర్నర్దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఇఫ్లూలో ఒక్క బీసీ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా లేకపోవడం దారుణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేయాలని డిమాండ్చేశారు.